భారతదేశం, మార్చి 17 -- Vemulawada Kalyanam: వేములవాడలో ప్రతియేటా మహాశివరాత్రి తర్వాత శివ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈసారి ఈనెల 16 నుంచి 20 వరకు ఐదు రోజులపాటు శివకళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం స్వస్తి పుణ్యవాచనం, అంకురార్పణం, చండీ ప్రతిష్ట, దేవత ఆహ్వానం, కలశ ప్రతిష్ట నిర్వహించారు.

సోమవారం ఉదయం 11లకు వేములవాడ రాజన్న సన్నిధిలో శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దివ్య కళ్యాణం నిర్వహిస్తున్నారు. అందుకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి శివపార్వతులు పెద్ద ఎత్తున తరలిరానున్న నేపథ్యంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. 19 న పట్టణ పురవీధుల్లో రథోత్సవం, 20న ధర్మగుండంలో త్రిశూల యాత్ర, రాత్రి అద్దాల మండపంలో డోలోత్సవం నిర్వహిస్తారు.

రాష్ట్రంలోని మిగతా శైవ క్షేత్రాల్లో కారణ...