భారతదేశం, ఏప్రిల్ 16 -- Vemulawada Crime: ప్రముఖ పుణ్యక్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఈనెల 13న యువకుడు పర్శరాములు హత్య కేసులో నలుగురి అరెస్టు చేశారు. వారి నుంచి రెండు గొడ్డళ్ళు, కొబ్బరి బొండాలు నరికే కత్తి, రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సమక్షంలో మీడియా ముందు వాటిని ప్రదర్శించి వివరాలు వెల్లడించారు.

వేములవాడలో హత్యకు గురైన పరశురాం.. ప్రస్తుతం అరెస్టు అయిన కోనాయిపల్లికి చెందిన బైరెడ్డి వినయ్, వేములవాడ కు చెందిన ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదునూరి రాజేశ్ అంతా ఓకే గ్యాంగ్ అని, గంజాయి దందాలో నిందితులేని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా పర్శరాం ముఠాకు దూరంగా ఉంటూ పోలీసులకు సహకరిస్తున్నాడనే నెపంతో హత్య చేసినట్లు తెలిపారు.

వేములవాడలోని శ్రీనగర్ కాలనీ చెందిన మృతుడు చెట్టిపెల్లి పర్శరాము...