తెలంగాణ,కరీంనగర్, మార్చి 28 -- Vemulawada Temple: దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో వింత ఆచారం కొనసాగుతుంది. అనాదిగా శివ కళ్యాణం రోజున శివపార్వతులుగా పిలువబడే జోగినీలు శివుడిని వివాహం చేసుకుంటారు. అద్భుతమైన ఆ ఘట్టాన్ని గురువారం వేములవాడ (Vemulawada)శ్రీ రాజరాజేశ్వరస్వామి సన్నిధిలో వైభవంగా నిర్వహించారు. శైవక్షేత్రాల్లో ఎక్కువగా మహాశివరాత్రి రోజున శివకళ్యాణం జరిగితే వేములవాడలో మాత్రం కామదహనం అనంతరం త్రిరాత్రి ఉత్సవాలు నిర్వహించిన అనంతరం శివకళ్యాణం నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఐదు రోజుల పాటు శివకళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయ సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో శివపార్వతులకు కళ్యాణం నిర్వహించారు.

Sri Raja Rajeshwara Swamy Devasthanam: శివ కళ్యాణానికి రాష్ట్ర నలుమూలల నుంచి శివపార్వతులుగా పిలువబడే జోగినీలు భారీ...