భారతదేశం, ఏప్రిల్ 15 -- Vemulawada: భక్తి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే వేములవాడ శ్రీరాజ రాజేశ్వరస్వామి ఆలయం చాళుక్యుల కాలంనాటి మహోన్నత శిల్పకళకు నిలువెత్తు సాక్ష్యం. క్రీ.పూ. 750 ప్రాంతంలో చాళుక్యులు నిర్మించిన వేములవాడ ఆలయం శతాబ్దాలుగా ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది.

చాళుక్యులు వారి సామ్రాజ్యాన్ని వేములవాడ కేంద్రంగా పాలించారని శాసనాలు చెబుతున్నాయి.ౠ ఆనాటి శిల్పకళ, నిర్మాణశైలి ఈ ఆలయ గోపురాలపై స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి ఆలయాన్ని పునఃర్నిర్మించే పనిలో ప్రభుత్వం నిమగ్నమైంది.

శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులను జూన్ 15 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. గత ఏడాది నవంబర్ 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.47 కోట్లు మంజూరు చేయడంతోపాటు బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు....