Hyderabad, మార్చి 12 -- Vellulli kodiguddu Recipe: రొయ్యల పచ్చడి, చికెన్ పచ్చడి, మటన్ పచ్చడి ఎలా పెట్టుకుంటామో... అలా కోడి గుడ్డుతో కూడా పచ్చడి పెట్టుకోవచ్చు. ఒకసారి వెల్లుల్లి కోడిగుడ్డు పచ్చడి చేసుకుంటే నెలరోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసుకుని తింటే ఆ రుచే వేరు. ముఖ్యంగా స్పైసీ వంటకాలనీ ఇష్టపడే వారికి ఈ పచ్చడి మంచి ఎంపిక. దీన్ని ఇంట్లోనే చాలా సులువుగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు రెసిపీ చూద్దాం.

ఉడికించిన గుడ్లు - మూడు

వెల్లుల్లి రెబ్బలు - ఎనిమిది

లవంగాలు - రెండు

దాల్చిన చెక్క - ఒక చిన్న ముక్క

యాలకులు - రెండు

నిమ్మరసం - ఒక స్పూను

ధనియాల పొడి - ఒక స్పూను

మెంతిపొడి - చిటికెడు

గరం మసాలా - అర స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - పావు స్పూను

కారం - ఒక స్పూను

ఇంగువ - చిటిక...