భారతదేశం, ఫిబ్రవరి 9 -- స్థానికంగా ఉండే రోడ్లకు అనుగుణంగా, పర్యావరణం, ఇంధన సామర్థ్యాన్ని బట్టి కంపెనీలు వాహనాలను తయారు చేస్తాయి. కానీ.. కొందరు కంపెనీలు తయారు చేసిన వాహనాలను మాడిఫికేషన్ చేస్తుంటారు. ఆకృతులు మార్చి.. తమకు నచ్చిన స్టైల్‌లో మాడిఫికేషన్ చేయించుకుంటారు. ఇది చట్ట ప్రకారం నేరం అని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి వాహనాలు పోలీసుల తనిఖీల్లో పట్టుబడితే.. జరిమానా విధిస్తారు. కొన్నిసార్లు వాహనాలను సీజ్ చేస్తారు కూడా.

ముఖ్యంగా బైక్‌లను వినియోగించేవారు.. సైలెన్సర్లను మార్చి.. ఎక్కువ శబ్ధం వచ్చేవాటిని బిగించుకుంటారు. ఆ బైక్‌లు రోడ్లపైకి వెళ్లిన సమయంలో ఇతర వాహనదారులు, ప్రజలు ఇబ్బందులకు గురవుతుంటారు. ఈ మధ్య కొందరు నాలుగు చక్రాల వాహనాలను కూడా మాడిఫికేషన్ చేయించుకుంటున్నారు. వాటిల్లో ముఖ్యంగా జీప్‌లను మాడిఫికేషన్ చేసి వినియోగిస్తున్నారు. తనిఖ...