భారతదేశం, నవంబర్ 25 -- Veera Simha Reddy First Single: మాస్ సాంగ్‌తో అభిమానుల్లో జోష్ నింపారు బాల‌కృష్ణ‌. వీర‌సింహారెడ్డి ఫ‌స్ట్ సింగిల్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. రాజ‌సం నీ ఇంటిపేరు, పౌరుషం నీ ఒంటి పేరు జై బాల‌య్య జైజై బాల‌య్య అంటూ సినిమాలో బాల‌కృష్ణ క్యారెక్ట‌రైజేష‌న్‌ను చాటిచెబుతూ ప‌వ‌ర్‌ఫుల్ లిరిక్స్‌తో ఈ పాట సాగింది. బాల‌కృష్ణ ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకొని మాస్ ట్యూన్స్‌తో ఈ పాట‌ను కంపోజ్ చేశారు సంగీత ద‌ర్శ‌కుడు త‌మ‌న్‌.

ఖ‌రీముల్లా ఆల‌పించారు. రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. ఫ‌స్ట్ సింగిల్‌తో ఈసినిమా ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. వీర‌సింహారెడ్డి సినిమాకు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సంక్రాంతికి వీర‌సింహారెడ్డి రిలీజ్ కానుంది. ఇందులో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచ...