భారతదేశం, ఫిబ్రవరి 11 -- రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. ఇప్పటికే వచ్చిన పోస్టర్లతోనే క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది. ఈ మూవీ విజయ్ వివిద గెటప్‍ల్లో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పేరు వీడీ12గా ఉంది. ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు సమయం దగ్గరపడింది. ఈ మూవీ టైటిల్ టీజర్ రేపు (ఫిబ్రవరి 12) విడుదల కానుంది. ఈ పాన్ ఇండియా రేంజ్ మూవీ టీజర్‌కు ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీల స్టార్ హీరోలు భాగస్వాములయయ్యారు.

వీడీ12 టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చారని మూవీ టీమ్ నేడు (ఫిబ్రవరి 11) అధికారికంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్‍కు టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. తమ...