భారతదేశం, జనవరి 16 -- వాస్తు శాస్త్రం ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటిస్తే సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండొచ్చు. అందుకే చాలామంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అనేక మార్పులను జీవితంలో చూడొచ్చు. అలాగే దంపతుల మధ్య ప్రేమానురాగాలు బలపడడానికి, సమస్యలు తొలగిపోవడానికి కొన్ని వాస్తు నియమాలను పాటించడం కూడా మంచిది.

చాలామంది వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు. అందుకనే ఇల్లు కొనుగోలు చేసే ముందు వాస్తు చూసుకుంటారు. అప్పుడే ఇంటిని కొనుగోలు చేస్తారు. ఇంట్లో ఉన్న ప్రతి గది, వస్తువును కూడా వాస్తు ప్రకారం ఉంచాలి. అప్పుడే అన్ని బాగుంటాయి. ప్రతికూల శక్తి లేకుండా, వాస్తు దోషాలు లేకుండా ఆనందంగా ఉండొచ్చు. అయితే, చాలా మంది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉండాలన...