భారతదేశం, నవంబర్ 19 -- చాలామంది ఇంట్లో వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులన్నీ తొలగిపోతాయని, సానుకూల శక్తి ప్రవహించి సంతోషంగా ఉండొచ్చని నమ్మకం. ఇంటిని నిర్మించడం మొదలు ఇంట్లో పెంచే మొక్కల వరకు ఎలాంటి వాస్తు నియమాలను పాటించాలో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. అలా చేయడం వలన వాస్తు దోషాలు తొలగిపోతాయి, సంతోషంగా ఉండొచ్చు.

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో కొన్ని మొక్కలను, చెట్లను పెంచుతున్నారు. ఇంటి ఆవరణలో మొక్కలు, చెట్లు ఉంటే స్వచ్ఛమైన గాలి వస్తుంది, మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. చాలా మందిలో ఉండే సందేహం ఏంటంటే, నిమ్మ చెట్టు ఇంట్లో పెంచవచ్చా? దాని వలన లాభమా? నష్టమా? అని అడుగుతుంటారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో నిమ్మ చెట్టు ఉండొచ్చా? దాని వలన ఏమైనా నష్టం కలుగుతుందా? అనేది ఈరోజు తెలుసుకుందాం. ...