భారతదేశం, నవంబర్ 24 -- ఇంట్లో మొక్కల్ని పెంచేటప్పుడు దక్షిణ దిశలో కొన్ని మొక్కలను ఉంచడం మంచిది కాదు. ముఖ్యంగా ఈ మొక్కలు దక్షిణం వైపు ఉంటే నష్టాలు కలుగుతాయి, సమస్యలు ఎక్కువవుతాయి. మరి మీ ఇంట్లో కూడా ఈ తప్పు చేస్తున్నారేమో చూసుకోండి. పొరపాటున కూడా దక్షిణ దిశలో ఈ మొక్కలు ఉండకూడదు. సమస్యలు, అప్పులు ఎక్కువ అవుతాయి. ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. శుభ ఫలితాలు ఎదురవుతాయి.

తులసి మొక్కను ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుతారు. తులసి మొక్కను లక్ష్మీదేవిగా భావిస్తారు, ప్రతిరోజు తులసి మొక్క ముందు పూజలు చేస్తారు. తులసి మొక్కని ఇంట్లో తూర్పు వైపు పెట్టాలి. తూర్పు వైపు తులసి మొక్క ఉండడం వలన అభివృద్ధి ఉంటుంది. అదే దక్షిణ దిశలో ఉన్నట్లయితే సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది, వాస్తు దోషాలు కలుగుతాయి. పేదరికం, ప్రతికూల శక్తితో బాధపడాల్సి ఉంటుంది. కాబట్టి తుల...