భారతదేశం, డిసెంబర్ 20 -- జ్యోతిష్యం, వాస్తు ప్రకారంగా మన శక్తి మరియు కర్మ అనేవి మన వ్యక్తిగత వస్తువులకు సంబంధించినవి. మనం వాటిని ఎవరితోనైనా పంచుకుంటే, మన సానుకూల శక్తి మరొకరికి వెళ్తుంది. వారి వ్యతిరేక శక్తి మనల్ని ప్రభావితం చేస్తుంది. ఇది జీవితంలో బాధలు, ఇబ్బందులు, డబ్బు నష్టం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బట్టలు, ఉంగరాలు, పాదరక్షలు, గడియారాలు మరియు దువ్వెనలు వంటి వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ పంచుకోకూడదు. వాటి వలన నష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది? మరి ఎలాంటి నష్టాలు రావచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

దుస్తులు నేరుగా మన చర్మానికి అనుసంధానించబడి ఉంటాయి. ఎక్కువ శక్తిని కలిగి ఉంటాయి. ఎవరితోనైనా దుస్తులను పంచుకోవడం మీకు ప్రతికూల శక్తిని కలిగిస్తుంది. దీంతో డబ్బు నష్టం వాటిల్లుతుందని, లక్ష్మీదేవికి కోపం వస్తుందని జ్యోతిష్యశాస్త్రంలో చెబుతారు. ...