తెలంగాణ,కరీంనగర్, ఫిబ్రవరి 2 -- కరీంనగర్ లోని చైతన్యపురిలో గల మహిమాన్విత శ్రీ మహాదుర్గ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దివ్య క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారుల అక్షరాభ్యాసానికి కొంగుబంగారంగా మారిన ఇక్కడి శ్రీ మహాసరస్వతి అమ్మవారి కోవెలలో విస్తృత ఏర్పాట్లు చేశారు.

శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి ఆశీస్సులతో ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం రోజున వసంత పంచమి సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు.

శ్రీమహాదుర్గ, శ్రీమహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్లు కలిసి ఒకే క్షేత్రంలో ఉండడంవల్ల భారీగా భక్తులు తరలిరానున్నారు. గత ఏడాది కంటే ఈసారి భక్తుల సంఖ్య పెరుగనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు...