భారతదేశం, నవంబర్ 21 -- వసంత పంచమి 2026: వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధిస్తే సరస్వతి దేవి అనుగ్రహం కలుగుతుందని, ఆమె అనుగ్రహంతో విద్యార్థులు చదువులో బాగా రాణిస్తారని నమ్ముతారు. మాఘ మాసంలో వసంత పంచమిని జరుపుతారు. ఆ రోజు సరస్వతి దేవి ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అక్షరాభ్యాసం కూడా చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. 2026లో వసంత పంచమి ఎప్పుడు వచ్చింది? వసంత పంచమి తేదీ, శుభ సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేయాలో ఇప్పుడే తెలుసుకుందాం.

ప్రతి ఏటా మాఘ మాసంలో వచ్చే శుక్ల పక్ష పంచమి నాడు వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం వసంత పంచమి ఎప్పుడు వచ్చిందంటే.. పంచమి తిథి జనవరి 23 ఉదయం 2:28కి మొదలై, 24 ఉదయం 1:46తో ముగుస్తుంది. ఉదయ తిధి ప్రకారం చూసుకోవాలి. కనుక వసంత పంచమి జనవరి 23న జరుపుకోవాలి.

2026లో వచ్చే వసంత పంచమి నాడు పూజించడానికి కొంచెం సమయం మాత్ర...