భారతదేశం, ఫిబ్రవరి 7 -- Operation Valentine Gaganala Song Released: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ 'ఆపరేషన్ వాలెంటైన్'. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అద్భుతమైన పోస్టర్‌లు, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రామిస్ చేసిన గ్రిప్పింగ్ టీజర్, రిపబ్లిక్ డేకి ముందు దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్ సింగిల్ సాంగ్ వందేమాతరంతో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం కొత్త విడుదల తేదీని ఇటీవలే అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మరో నెలలో సినిమా థియేటర్లలోకి రానుంది కాబట్టి, ప్రమోషన్స్‌ ను మరింత దూకుడుగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. సంగీత దర్శకుడు మిక్కీ ...