Hyderabad, జనవరి 2 -- వంకాయ కూరను ఇష్టపడే వారి సంఖ్య తక్కువే. కానీ దాన్ని సరైన పద్ధతిలో వండితే రుచి అదిరిపోతుంది. వంకాయ ఇష్టం లేకపోయినా కూడా ప్రతి వారం ప్రతి ఇంట్లో ఒక్కసారి అయినా వంకాయ కచ్చితంగా వండుతారు. పిల్లల్లో కూడా వంకాయ మసాలా కూర వంటివి వడ్డిస్తారు. ఇక్కడ మేము వంకాయ పల్లి కారం వేపుడు రెసిపీ ఇచ్చాము. ఇది అద్భుతంగా ఉంటుంది. కొత్త రుచితో మీకు నచ్చుతుంది. సాంబార్ చేసుకున్నప్పుడు, పప్పు వండుకున్నప్పుడు, రసం చేసుకున్నప్పుడు పక్కన వంకాయ పల్లి కారం వేపుడు కూడా చేసి పెట్టుకోండి. ఆ రుచి అద్భుతంగా ఉండటం ఖాయం. ఒక్కసారి మీరు వండుకుంటే దీనికి మీరు దాసోహం అయిపోతారు. ఇక రెసిపీ ఎలాగో తెలుసుకోండి.

వంకాయలు - అరకిలో

నూనె - రెండు స్పూన్లు

మినప్పప్పు - ఒక స్పూను

పచ్చిశనగపప్పు - ఒక స్పూను

ఆవాలు - ఒక స్పూను

జీలకర్ర - రెండు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి...