భారతదేశం, మార్చి 21 -- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లోనే రాజకీయ రాజధాని విజయవాడ. అలాంటి బెజవాడలో రాజకీయంగా చక్రం తిప్పింది వంగవీటి కుటుంబం. వంగవీటి రాధా (రంగా సొదరుడు) హత్య తర్వాత విజయవాడ రాజకీయం పూర్తిగా మారిపోయింది. రంగా ప్రవేశంతో వేడెక్కింది. 1985లో రంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో.. రంగా జైలుకు వెళ్లాల్సి వచ్చింది.

రంగా జైల్లో ఉండగానే.. 1988 జులై 10న జరిగిన కాపునాడు సభలో ఆయనను తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత జైలు నుంచి విడుదలైన రంగా.. జనచైతన్య యాత్ర చేసి ఎన్.టి.రామారావు ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. పోలీసులు ఆధిపత్యం చెలాయిస్తున్నారని పోరాడారు. పేదల కోసం, బలహీన వర్గాల కోసం ఆయన అనేక ఉద్యమాలు చేశారు. విజయవాడలోని గిరిపురంలోని పేదల ఇళ్ల పట్టాల కోసం ఆయన నిరాహార దీక్ష చేశారు. కాపు సామాజిక వర్గ...