Telangana,khammam, ఏప్రిల్ 12 -- పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటు రావటంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా రామయ్య అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గుండెపోటు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా. తుది శ్వాస విడిచారు.

ఇయ అసలు దరిపల్లి రామయ్య. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లిలో జన్మించారు. ప్రకృతి ప్రేమికుడైన ఆయన. కోటిపైగా మొక్కలు నాటారు. దీంతో ఆయన పేరు వనజీవి రామయ్యగా మారిపోయింది. ట్రీ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియాగా గుర్తింపు పొందారు. ఆయన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. 2017లో పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది.

రామయ్యతో పాటు ఆయన భార్య జానమ్మ కూడా ఆయనకు తోడ్పాటునిచ్చేది. ఐదు దశాబ్దాలకు పైగా సామాజిక అడవుల పెంపకం కోసం నిరంతరం పని చేస్తూ వచ్చారు. మానవ శ్రేయస్సుకు విత్తనమే పరిష్కారం అని రామయ్య బల...