భారతదేశం, ఫిబ్రవరి 16 -- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ.. ఉచ్చు బిగుస్తోందనే కామెంట్స్ ఇప్పుడు కృష్ణా జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. ఆయన పెండింగ్‌ కేసులపై పోలీసులు ఫోకస్ పెట్టారని ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు విచారణకు హాజరుకాకుండా ఉన్న కేసులను పోలీసులు బయటకు తీస్తున్నట్టు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వంశీ గన్నవరం రాలేదు. దీంతో దర్యాప్తునకు ఆటంకం కలిగిందని అంటున్నారు.

వంశీకి సంబంధించిన పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి.. కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో జరిగిన కొన్ని ఘటనలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. గన్నవరం నియోజకవర్గంలోని హనుమాన్‌ జంక్షన్‌ ఠాణాలో గతేడాది నవంబరులో ఓ కేసు నమోదైంది. దీంట్లో వంశీ ఏ2గా ఉన్నారు. ఈ కేసులో వంశీని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించేందుకు పోలీసులు ప...