భారతదేశం, ఫిబ్రవరి 13 -- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. వంశీకి నోటీసులు ఇచ్చారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ ఖండించగా.. టీడీపీ నాయకులు సమర్థిస్తున్నారు.

'వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్‌ ఏంటి. కక్షపూరిత రాజకీయాలు ఉండకూడదు. ఇలాంటి రాజకీయాలు మంచిది కాదు' అని మాజీమంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 'రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ ప్రత్యక్ష ఉదాహరణ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదుదారుడు కేసు వెనక్కి తీసుకున్నాడు. అయినా అక్రమంగా వంశీని అరెస్ట్ చేయడమేంటి? వంశీ ...