భారతదేశం, ఫిబ్రవరి 14 -- వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట గురువారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో ఉదయమే అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడ్నుంచి విజయవాడకు తరలించారు. కృష్ణలంక పోలీస్స్టేషన్ కు వల్లభనేని వంశీ తరలించగా.. కొన్నిగంటల పాటు ప్రశ్నించారు. కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల పాటు జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.

వంశీని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కృష్ణలంక పోలీస్స్టేషన్ లో దాదాపు 8 గంటలకు పైగా విచారించారు. గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్థన్ను కిడ్నాప్ చేసి దాడి చేశారని నమోదైన కేసు గురించి ఆరా తీశారు. ఫిర్యాదులో బాధిత కుటుంబం ఇచ్చిన ఆధారాలు చూపించి వంశీ నుంచి వివరణ తీసుకున్నారు.

విచారణ తర్వాత వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్ కు తరలించారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్...