భారతదేశం, ఫిబ్రవరి 13 -- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. గతేడాది ఎన్నికలకు ముందు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు వల్లభనేని వంశీ.

టీడీపీ ఆఫీసు ఆపరేటర్ ముదునూరి సత్యవర్ధన్ ఇచ్చిన ఫిర్యాదుతో.. పోలీసులు ఐపీసీ సెక్షన్ 143, 147, 148, 435, 506 రెడ్విత్ 149, 3(1) (ఎస్సీ, ఎస్టీ చట్టం) కింద కేసు నమోదు చేశారు. వంశీ అనుచరులపై కేసు నమోదైంది. మొత్తం మీద 71 మంది ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాలు, వీడియోల ద్వారా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. ఇటీవల...