భారతదేశం, ఫిబ్రవరి 13 -- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తున్నారు. గన్నవరంలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో వంశీని అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో వంశీ నిందితుడిగా ఉన్నారు. గతేడాది ఎన్నికలకు ముందు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. అప్పడు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నారు వల్లభనేని వంశీ.

వంశీని విజయవాడ సీఐడీ కార్యాలయానికి తీసుకువెళ్లనున్నట్టు తెలుస్తోంది. గురువారం సాయంత్రం లోపు విజయవాడ తీసుకురానున్నారు. వంశీపైన కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం వంటి కేసులు ఉన్నాయి. చిక్కవరం బ్రహ్మలింగస్వామి చెరువులో అక్రమ మట్టి తవ్వకాల విషయంలోనూ వంశీపై కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. వంశీకి బీఎన్‌ఎస్ సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3...