భారతదేశం, ఫిబ్రవరి 13 -- గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ పటమట పోలీసులు వంశీని.. గురువారం ఉదయం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఆయన్ను విజయవాడకు తరలిస్తున్నారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

గన్నవరం టీడీపీ ఆఫీసులో పనిచేసే కంప్యూటర్ ఆపరేటర్‌ సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి.. బెదిరించినట్లు వంశీపై ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తనను బెదిరించారని సత్యవర్ధన్‌ ఫిర్యాదు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై కేసులో.. తనను బెదిరించి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని సత్యవర్థన్ ఫిర్యాదు చేశారు. దీంతో కిడ్నాప్, దాడి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు.

వల్లభనేని వంశీపై బీఎన్ఎస్ సెక్...