భారతదేశం, ఫిబ్రవరి 15 -- Vallabhaneni Vamsi : టీడీపీ కార్యాలయంలో పనిచేసిన సత్యవర్ధన్‌ను కిడ్నాప్, దాడి చేసిన కేసులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని వల్లభనేని వంశీ ఇంట్లో ఏపీ పోలీసులు సోదాలు చేపట్టారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని వంశీ ఇంట్లో ఏపీ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

వల్లభనేని వంశీ వినియోగించిన ఫోన్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఫోన్ స్వాధీనం చేసుకుంటే కేసుకు సంబంధించిన ముఖ్యమైన ఆధారాలు లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో వంశీని అరెస్టు చేసే సమయంలో ఆయన వద్ద మొబైల్ దొరకలేదు. దీంతో ఆ వ్యక్తిగత సహాయకుడి ఫోన...