Hyderabad, ఫిబ్రవరి 6 -- వాలెంటైన్స్ డే అంటే యూత్ కి ఎంతో ఇష్టమైన వేడుక. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెల కోసం ఎంతో మంది ప్రేమికులు ఎదురుచూస్తూ ఉంటారు. ఫిబ్రవరి 14 వచ్చిందంటే ప్రేమతో వారి గుండెలు నిండిపోతాయి. వాలెంటైన్స్ డే రావడానికి వారం రోజుల ముందు నుంచే ప్రేమ వేడుకలు మొదలైపోతాయి. ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేకమైన దినోత్సవాన్ని కేటాయించారు. ఫిబ్రవరి 7వ తేదీన మొదలైన ప్రేమ వారం ఫిబ్రవరి 14న ముగుస్తుంది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఫిబ్రవరి 14 వరకు ఏ రోజు ఏ స్పెషల్ డే నో తెలుసుకోండి.

ఫిబ్రవరి 7 - రోజ్ డేఫిబ్రవరి 7న వాలెంటైన్స్ వీక్ మొదటి రోజుగా నిర్వహించుకుంటారు. ప్రేమికులు ఈ రోజును రోజ్ డేగా జరుపుకుంటారు. వివిధ రంగుల గులాబీలు వేర్వేరు భావాలను సూచిస్తాయి. స్నేహానికి పసుపు గులాబీలు, ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎరుపు గులాబీలు ఇవ్వాలి. అందమైన గులాబీల అమ్మకాలు...