Hyderabad, ఫిబ్రవరి 4 -- వాలెంటైన్స్ వీక్ మొదలు కావడానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తమ భాగస్వాములను విభిన్న విధానాలతో ఆకట్టుకోవాలని కోరుకుంటారు. ఇందుకోసం వారి వారి ప్రియమైన వారి ఇష్టాలను పరిగణలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ప్రియుడు, ప్రేయసి లేదా భాగస్వామి మంచి ఫుడ్ లవర్ అయి ఉంటే మాత్రం వాలెంటైన్స్ వీక్ రోజుల్లో లేదా వాలెంటైన్స్ డే రోజున మీరు వారిని కచ్చితంగా మీ చేతివంటతో ఇంప్రెస్ చేయాల్సిందే. మీరే స్వయంగా వారి కోసం ఇష్టమైన పదార్థాన్ని చేసి ఇవ్వడం వారిని చాలా బాగా ఆకట్టుకుంటుంది.

మీ భాగస్వామి స్వీట్ ఇష్టపడే వారైతే మీరు వారికోసం చాక్లెట్, కేక్ రెసినీలకు ఎంచుకోవచ్చు. కానీ వారు స్పైసీ ఫుడ్ ఇష్టపడే వారైతే మాత్రం మీరు ఈ మోమోస్ రెసిపీని ఎంచుకోండి. మోమోస్ ఇష్టపడని స్పైసీ ఫుడ్ లవర్స్ దాదాపు ఉండరు. అయితే ఎప్పటిలాగా మైదాతో మోమోస్ తయా...