భారతదేశం, ఫిబ్రవరి 14 -- ప్రేమ.. అనిర్వచనీయమైన పదం ఇది. అర్థం చెప్పలేని అనుభూతి ఉంది. రెండు మనసులను కలిపే బంధం ఇది. ఒక్కో జనరేషన్ ఒక్కోలా మారుతున్నా, ఒక్కోలా పిలుస్తున్నా.. ప్రేమ మాత్రం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. ఈ రోజు వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14). ఈ స్పెషల్ రోజున మీ పార్టనర్ తో కలిసి ఓటీటీలో ఈ లవ్ స్టోరీలను చూసేయండి. మనసులో మరింత ప్రేమను నింపుకోండి.

తెలుగు సినిమాల్లోని కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీల్లో 'సీతారామం' ఒకటి అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ సినిమా, ఇందులోని డైలాగ్ లు, ప్రేమ, క్లైమాక్స్.. ఇలా ప్రతీది అద్భుతమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న కీలక పాత్రలు పోషించిన సీతారామం మాటల్లో వర్ణించలేని దృశ్య కావ్యం. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ అద్భుతాన్ని ఒక్కసారైనా చూడాల్సిందే. క్లైమాక్స్ లో మీ కళ్లు చెమర్చకుండా ఉండలేవు. ఈ మూవీ అమెజా...