Hyderabad, ఫిబ్రవరి 10 -- లవ్ స్టోరీ ఎక్కడైనా స్టార్ట్ కావొచ్చు. స్కూల్, కాలేజ్ లేదా ఆఫీస్ క్రష్ ఎక్కడైనా సరే, మీలో ప్రేమ చిగురించవచ్చు. కానీ, మీలో ఫీలింగ్స్ ను సరైన సమయానికి అవతలి వ్యక్తికి తెలియజేయకపోతే అది వన్ సైడ్ లవ్ గానే మిగిలిపోతుంది. అందుకే మీరు ప్రేమను బయటకు చెప్పడం కనీసం వారికి అర్థమయ్యేందుకు కొన్ని ప్రయత్నాలు చేయడం చాలా ముఖ్యం. మీ క్రష్ దృష్టిని మీ వైపుకు తిప్పుకోవాలంటే కాష్త కష్టపడాల్సిందే. ఇటువంటి సమయంలో చాలా మంది ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా అనే ఆలోచనలోనే ఉంటారు. ఎందుకంటే ఈ ప్రక్రియలో వేగంతో పాటు కచ్చితంగా ఫెయిల్ అవకూడదనే తపన కూడా ఉంటుంది కదా మరి.

ముందుగా మీరు మీ ప్రేమలో సక్సెస్ కావాలంటే, పూర్తి కృషి కనబరచడం చాలా అవసరం. అందుకే, ఈ వాలెంటైన్స్ డే రోజున మీ క్రష్ అటెన్షన్ పొందాలనుకుంటే, ఆమెను ఆకర్షించడానికి కొన్ని సైకాలజికల్ ట్రిక్స్...