భారతదేశం, ఫిబ్రవరి 6 -- వాలెంటైన్స్ వీక్ వచ్చేసింది. ఫిబ్రవరి 7న ప్రేమికుల వారోత్సవాలు రోజ్ డేతో మొదలైపోతాయి. ఈ వేడుకలు ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తాయి. మీ ప్రియమైనవారితో గడిపేందుకు ఇప్పటికే మీరు ఎంతో ప్లాన్ చేసి ఉంటారు. దీన్నే డేటింగ్ అంటారు. మేము ఇక్కడ కొన్ని డేటింగ్ పద్ధతులను ఇచ్చాము. ఇవి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేనివి. అలాగే ప్రేమికుల మధ్య బంధం మరింత బలపడేవి. ఈ డేటింగ్ ఐడియాలు మీరూ అర్థం చేసుకోండి.

ఇది మీ మొదటి డేట్ కావచ్చు. ఇద్దరూ ఒకటే అని అర్థం వచ్చేలా ఒకేలాంటి టీషర్టులు వేసుకునేందుకు ప్రయత్నించండి. రెస్టారెంట్ కు వెళ్లి మీకు నచ్చిన ఆహారాలు ఆర్డర్ చేసుకుని ఇద్దరూ మాట్లాడుకుంటూ తింటే ఆ కిక్కే వేరు. మీ అనుబంధంలో ఇష్టమైన క్షణాలను మీరే సృష్టించుకోవాలి. ఇవి అమూల్యమైన క్షణాలుగా జీవితంలో మిగిలిపోతాయి.

డ్యాన్స్ క్లాస్ కావచ్...