Hyderabad, ఫిబ్రవరి 4 -- ప్రేమించే మనస్సున్న ప్రతి ఒక్క హృదయానికి వాలెంటైన్స్ డే ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. తమ బిజీ షెడ్యూల్ నుండి కొంత సమయాన్ని కేటాయించుకుని తమ భాగస్వామితో/ ప్రియమైన వారితో హృదయపూర్వకంగా సమయం గడపడానికి ఆసక్తి కనబరుస్తాం. ఈ ప్రత్యేక రోజున, ప్రేమికులు తమ మనస్సును వ్యక్తపరచడానికి గులాబీలను కచ్చితంగా ఉపయోగిస్తారు. గులాబీ రంగులు ఒక్కొక్కటి ప్రత్యేకమైన అర్థం కలిగి ఉంటుందని నమ్ముతారు. అలాగే శుభాకాంక్షలు తెలిపేందుకు వినియోగించే గులాబీల సంఖ్యను బట్టి కూడా అభిమానాన్ని తెలియజేయొచ్చట. అదెలాగో తెలుసుకుందామా!

వాలెంటైన్స్ డే రోజున మీ భాగస్వామికి ఒక గులాబీ ఇవ్వడం అంటే, మీరు వారిని తొలి చూపులోనే ప్రేమించేశారని అర్థం. ఇక గులాబీ వారికి ఇవ్వడం వెనుక, వారితో బంధంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారని తెలియజేస్తున్నట్లుగా అవుతుంది.

మీరిద్దరూ పరస్ప...