Hyderabad, ఫిబ్రవరి 8 -- ప్రేమికుల పండుగ వచ్చేసింది. ఇప్పటికే మొదలైన వాలెంటైన్ వీక్ సందడి దేశవ్యాప్తంగా కనిపిస్తోంది. రోజ్ డేతో మొదలుకొని వాలెంటైన్స్ డే వరకూ వారం రోజుల పాటు రకరకాలుగా పద్ధతుల్లో తమ ప్రేమను వ్యక్తపరుస్తూ ప్రేమ పండుగను ఘనంగా జరుపుకుంటారు ప్రేమికులు. ప్రతి రోజూ కలుసుకోవడం పువ్వులు, చాక్లెట్లు, టెడ్డీలతో పాటు ప్రేమతో కూడిన ముద్దులు, హగ్గులు, ప్రత్యేకమైన గిఫ్టులతో కలిపి పెద్ద పండుగలా జరుపుకుంటారు. అయితే ఇదంతా దగ్గరలో ఉన్న ప్రేమికుల సంగతి. దూరంగా ఉన్నవారి విషయంలో అలా ఉండదు కదా.

చదువుల కోసం, ఉద్యోగాల కోసం కొందరు, కుటుంబ పరిస్థితుల రీత్యా మరికొందరు ప్రేమికులు ఎక్కడో దూరంగా ఉంటూనే ప్రేమించుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడూ మాత్రమే కలుసుకుని మాట్లాడుకుంటారు. దేశవిదేశాలకు వెళ్లిన వారి పరిస్థితి ఇంకా బాధాకరం. వీరి నేరుగా కలుసుకుని మాట్లాడు...