Hyderabad, ఫిబ్రవరి 14 -- ఫిబ్రవరి 14 వచ్చిందంటే ప్రేమికుల ప్రపంచం ఎరుపు రంగుతో నిండిపోతుంది. ఎరుపు రంగు గులాబీలు ఎరుపు రంగు టెడ్డీబేర్, ఎర్రని లవ్ సింబల్స్, ఎరుపు రంగు దుస్తులతో అంతా ఎరుపు వర్ణమయంగా మారిపోతుంది. ప్రేమకు ఎరుపు రంగుకు సంబంధం ఏమిటి? వాలెంటైన్స్ డే రోజు ఎరుపు రంగుకు ఎందుకంత ప్రత్యేకత?

వాలెంటైన్స్ డే మూలాలు పురాతన రోమ్ రాజ్యంలో గుర్తించారు. అక్కడ లూపెర్కాలియా అనే వేడుక జరిగేది. ఫిబ్రవరి మధ్యలో జరిగే పండుగ ఇది. సంతానోత్పత్తి పండగగా కూడా చెప్పుకునేవారు. అలాగే వసంతకాలం రాకను కూడా ఈ పండుగ సూచిస్తుందని అనేవారు. ఈ పండుగను నిర్వహించుకుంటే మహిళలకు సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. ప్రేమ కోసం ఎరుపు రంగు మంచిదని అప్పట్లో భావించేవారు. ఎరుపు రంగు బోల్డ్ గా కనిపిస్తుంది. ఆకర్షణీయంగా ఉంటుంది. శక్తివంతంగా ఉంటుంది. ఇది జీవితాన్ని సూచిస్తుందని...