Hyderabad, ఫిబ్రవరి 14 -- ప్రేమ అనంతమైనది . ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిలో ఏదో ఒక సమయంలో ప్రేమ పుడుతుంది. ఫిబ్రవరి నెల ప్రారంభం కాగానే ఎక్కడ చూసినా గులాబీలు, టెడ్డీబేర్లు, చాక్లెట్లు అమ్మకాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీనికి కారణం వాలెంటైన్స్ డే. వాలెంటైన్స్ వీక్ ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 14 వరకు నిర్వహించుకుంటారు .వాలెంటైన్స్ వీక్ రోజ్ డేతో మొదలై ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది.

చాలా మంది ప్రేమికులు తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఈ రోజు కోసం ఎదురు చూస్తారు. అయితే ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను ఎందుకు నిర్వహించుకుంటారో చాలా మందికి తెలియదు. ప్రేమకు చిహ్నంగా వాలెంటైన్స్ డే ఎలా పుట్టుకొచ్చింది? దాని చరిత్ర ఏమిటో తెలుసుకోండి.

వాలెంటైన్స్ డేను అనేక శతాబ్దాలుగా ఫిబ్రవరి 14న జరుపుకుంటున్నారు. 14 వ శతాబ్దం నుండి వాలెంటైన్స్ డేను నిర్వహించుకుంటు...