New Delhi, ఫిబ్రవరి 14 -- Valentine's Day Google Doodle: వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమ వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ సాహిత్యానిది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా వాలంటైన్స్ డే కు దాదాపు ఒక వారం ముందు నుంచీ వాతావరణం అంతా ప్రేమమయంగా మారుతుంది. సాధారణంగా, ప్రేమ అనే హ్యూమన్ ఎమోషన్ ను మించిన ఆసక్తికరమైన అంశం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఆకర్షణ, రొమాన్స్, క్రష్, ప్రేమ అనే భావాలకు కారణమయ్యేది హార్మోన్లు, రసాయనాలేనని ఇప్పుడు రుజువైంది. ఉత్సాహభరితమైన అనుభూతి, తీవ్రమైన భావోద్వేగాలు లోతైన అనుబంధం.. మొదలైనవి డోపమైన్, ఆక్సిటోసిన్, ఆడ్రినలిన్ వంటి హార్మోన్ల స్రావానికి కారణం కావచ్చు. ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజు గూగుల్ డూడుల్ లో ప్రేమ భావన వెనుక దాగిన శాస్త్రీయ కారణాలను, రొమాన్స్ కు ప్రేరేపించే కెమిస్ట్రీని వివరించారు.

ఈ వాలె...