Hyderabad, మార్చి 31 -- Vaishnavi Chaitanya Remuneration Rs.1 Cr: తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకి అవకాశాలు రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. అందం, అభినయం ఉన్న ఎంతోమంది తెలుగు ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్స్‌ కాలేకపోయారు. ఇతర ఇండస్ట్రీల నుంచి వచ్చిన హీరోయిన్స్‌కు ధీటుగా రాణించలేకపోయారు.

కానీ, కొంతమంది మాత్రం ఆకట్టుకునే పాత్రలు చేస్తూ స్టార్ హీరోయిన్ రేంజ్‌లో కాకపోయినా క్రేజీ నేమ్ తెచ్చుకుంటున్నారు. అలాగే, కొంతమంది తెలుగు అమ్మాయిలు కష్టపడి పనిచేసి అవకాశాలు పొందడమే కాకుండా తక్కువ సమయంలో స్టార్స్‌గా కూడా మారారు. అలాంటి అతి తక్కువ మంది హీరోయిన్లలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు.

కెరీర్ ప్రారంభంలో 'లవ్ ఇన్ 143 అవర్స్' 'ది సాఫ్ట్‌వేర్ డెవలపర్‌' 'అరెరె మానస' 'మిస్సమ్మ' వంటి షార్ట్ ఫిల్మ్స్‌తో నటిగా గుర్తింపు తెచ్చుకుంది వైష్ణవి చైతన్య. అనంతరం...