భారతదేశం, నవంబర్ 27 -- Vaikuntha Ekadashi 2025: వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. విష్ణు పురాణం ప్రకారం ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే సిరిసంపదలు కలుగుతాయి, మోక్షం కూడా లభిస్తుందని నమ్మకం. ఈసారి వైకుంఠ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? వైకుంఠ ఏకాదశి నాడు ఏం చేయాలి, ఏం చేయకూడదు వంటి విషయాలను తెలుసుకుందాం.

శేషతల్పం పై శయనించి విష్ణువును దర్శించుకోవడానికి వైకుంఠానికి ముక్కోటి దేవతలతో పాటు స్వామి వారు భూలోకానికి వచ్చే శుభ సందర్భం. ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని ఈరోజు దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని, ఎంతో మంచి జరుగుతుందని, శుభ ఫలితాలను పొందవచ్చని చెబుతారు. వైకుంఠ ఏకాదశిని (Vaikunta ekadashi 2025) ముక్కోటి ఏకాదశి (Mukkoti ekadashi) అని కూడా అంటారు.

ఏకాదశి తిధి డిసెంబర్ 30 మంగళవారం ...