Hyderabad, ఫిబ్రవరి 21 -- నార్మల్ డెలివరీ అయిన తర్వాత చాలా మంది మహిళలకు జననాంగంలో కుట్లు వేస్తారు. జననాంగం నుంచి శిశువును బయటకు తీసుకువచ్చే సమయంలో కాస్త చీలిక ఏర్పడుతుంది. ప్రసవం తర్వాత ఈ చీలిక మానిపోయేందుకు కొంత భాగం వరకూ కుట్లు వేస్తారు. సిజేరియన్‌తో పోలిస్తే, నార్మల్ డెలివరీ మంచి ఆప్షన్. అయినప్పటికీ, జననాంగంలో వేసిన కుట్ల కారణంగా కాస్త నొప్పిగానే ఉంటుంది. వీటిని సరైన పద్దతిలో హ్యాండిల్ చేయలేకపోతే అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

కుట్లు వేసిన భాగంలో వాపు లేదా నొప్పిగా ఉంటే ఐస్‌తో మసాజ్ చేయండి. నేరుగా జననాంగంపై ఐస్ ముక్కలు రుద్దకుండా ఏదైనా గుడ్డ లేదా కవర్ లాంటి దానిలో ఉంచాలి. ఇలా 20-30 నిమిషాల వరకూ చేయడం వల్ల నొప్పి నుంచి రిలీఫ్ పొందగలరు.

నొప్పి నుంచి రిలీఫ్ పొందడానికి వేడి నీటిని ఉపయోగించడం ముఖ్యం. కుట్లను జాగ్రత్తగా చూసుక...