Hyderabad, ఫిబ్రవరి 2 -- గర్భిణీగా ఉన్న సమయంలో నొప్పి కలగడం అనేది సహజమే. వెన్నుకింద నుంచి రొమ్ముల వరకూ ప్రతి భాగం నొప్పితో ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా మంది మహిళల్లో సర్వసాధారణంగా ఈ లక్షణం కనిపిస్తుందట. ఇలా జరగడానికి కారణం గర్భాశయ సైజు పెరుగుతుండటం వల్ల కలిగే ఒత్తిడి లేదా హార్మోన్లలో మార్పులు కావొచ్చు. సమయం పెరుగుతున్న కొద్దీ ఈ నొప్పి అనేది క్రమంగా పెరుగుతుంటుంది. ఈ నొప్పి సహజమేనని తీసిపారేయొచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో ఇది గర్భస్రావానికి కూడా కారణం కావొచ్చు.

మీ యోని భాగంలో నొప్పి ఎక్కువగా కలుగుతుంటే, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడ్ని సంప్రదించండి.

వెజైనల్ పెయిన్ (యోని నొప్పి) అనేది గర్భిణీగా ఉన్నప్పుడు సహజంగా కనిపించే సమస్యేనని గైనకాలజిస్టులు చెబుతున్నారు. ఇదే అంశంపై జరిపిన ఒక రీసెర్చ్‌లో గర్భవతులలో సాధారణంగానే యోనిలో నొప్పి పెర...