భారతదేశం, జూలై 30 -- గర్భధారణ సమయంలో, స్త్రీ శరీరం అనేక మానసిక, శారీరక మార్పులకు లోనవుతుంది. గర్భధారణ తర్వాత మహిళలు శారీరక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా యోని ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డెలివరీ తర్వాత మహిళల యోనిలో అనేక మార్పులు ఉంటాయి. దీని వల్ల అది మరింత సున్నితంగా మారుతుంది. నార్మల్ డెలివరీ తర్వాత చాలాసార్లు, యోని 'ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదమూ ఉంటుంది. ఈమధ్యే మీకు నార్మల్ డెలివరీ అయితే , డెలివరీ తర్వాత మీ యోని ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

డెలివరీ అయిన రోజుల్లో మహిళల్లో కాస్త ఎక్కువ రక్తస్రావం అవుతుంది. ఇది సాధారణంగా 4 నుండి 6 వారాల వరకు ఉండొచ్చు. ఈ సమయంలో మహిళ తన పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీని కోసం ఎప్పటికప్పుడు ప్యాడ్ మార్చడం లేదా యోనిని శుభ్రపరచడం చాలా ముఖ్యం. పరిశుభ్రతను విస్మ...