Hyderabad, జనవరి 26 -- యోని నుంచి వాసన రావడం అనేది సహజంగా అందరిలోనూ జరిగేదే. అయితే అది దుర్వాసనగా మారితేనే పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణంగా బుతుక్రమంలో ఉన్నప్పుడు, కలయిక సమయంలో,గర్భధారణ సమయంలో యోని నుంచి ప్రత్యేకమైన వాసనలు వస్తుంటాయి. అలా కాకుండా సాధారణ రోజుల్లో కూడా యోని నుంచి వాసన వస్తుంటే అది దుర్వాసన అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

ముఖ్యంగా ఆహారం విషయంలో యోని నుంచి వాసనకు మీరు తినే ఆహారం కూడా కారణమవచ్చు. ఎందుకంటే యోని ప్రేగు ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రేగలను ఆరోగ్యంగా ఉంటేనే యోని కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఫలితంగా యోని వ్యాధులు, దుర్వాసన వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. మీ యోని నుంచి తరచుగా దుర్వాసన వస్తున్నట్లయితే మీ డైట్లో కోన్ని ఆహార పదార్థాలను తప్పకుండా చేర్చుకోండి. ఇవి యోని ఆరోగ్యాన్ని పెంచి మంచి వాసన వచ్చే...