భారతదేశం, మార్చి 6 -- Vada In TTD Menu: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు అందించే అన్నప్రసాదాలలో అదనంగా 'వడ' ప్రసాదంను పంపిణీ ప్రారంభించారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో గురువారం టీటీడీ ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ ఛైర్మన్ భక్తులకు వడలను ప్రసాదంలో వడ్డించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్న ప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని నేటి నుంచి ప్రారంభించామన్నారు.
ఇప్పటికే తిరుమలకు వచ్చే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్లు టీటీడీ చైర్మన్నాయుడు తెలిపారు....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.