భారతదేశం, ఫిబ్రవరి 6 -- Vaccine Reaction: టీకా వికటించి పసి పాప మృతి చెందడంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్డీవో ద్వారా అందజేశారు.

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాసరి లత రమేశ్ దంపతుల 45 రోజుల పసిపాప మృతి చెందారు. టికా కోసం ఆసుపత్రికి తీసుకురాగ డాక్టర్ చూసి టికా వేయించారు. కాసేపటికి నిద్రలోకి జారుకున్న పాప ఇంటికి ళ్ళేసరికి కదలలేని స్థితికి చేరింది.

కంగారు పడ్డ పేరెంట్స్ పాపను ప్రైవేట్ పిల్లల డాక్టర్ వద్దకు తుసుకెళ్ళారు. పిల్లల డాక్టర్ చూసి పాప మృతి చెందిందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టికా వేసిన తర్వాతే పాప అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయిందని భావిస్తు పాప శవంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని ఆందోళనకు దిగారు.

పాప మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమ...