భారతదేశం, ఫిబ్రవరి 17 -- Uttarandhra Mlc Election : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్యర్థుల ఎవ‌రి ప్రభావం ఎంత అనే చ‌ర్చోప‌చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ మాత్రం త్రిముఖ పోటీ నెల‌కొంది. మూడు బ‌ల‌మైన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు. రాజ‌కీయ పార్టీలు ప్రత్యక్షంగా పాల్గొన‌కుండా జ‌రుగుతున్న ఈ ఎన్నిక‌ల ప‌ట్ల అంద‌రిలోనూ ఆస‌క్తి నెల‌కొంది. ఈనెల 27 పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మార్చి 3 ఓట్ల లెక్కింపు ఉంటుంది. అయితే ఈ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప‌ది ముఖ్యమైన అంశాల‌ను తెలుసుకుందాం.

1. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో 10 మంది అభ్యర్థులు బ‌రిలో ఉన్నారు. 123 పోలింగ్ స్టేష‌న్లలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. మొత్తం 22,493 మంది ఓట‌ర్లు ఉన్నారు. అందులో 13,503 మంది పురుషులు, 8,985 మంది మ‌హిళ‌లు ఉన్నారు. శ్రీకాకుళం, విజ‌య‌న‌గరం, మ‌న్యం పార్వ...