Hyderabad, మార్చి 27 -- గర్భాశయం, అండాశయాలు అనేవి మహిళలకు చెందిన అవయవాలు. పునరుత్పత్తి వ్యవస్థలో మహిళలకు ఇవి ఎంతో ముఖ్యమైనవి. అయితే మహిళలకు ఉండాల్సిన అవయవాలు ఒక్కోసారి పురుషుల్లో కనిపించవచ్చు. అలాంటి పురుషులకు పెర్సిస్టెంట్ ముల్లెరియన్ డక్ట్ సిండ్రోమ్ ఉందని చెబుతారు. ఈ వ్యాధి ఉన్న పురుషులలో గర్భాశయం, అండాశయాలు, ఫెలోపియన్ ట్యూబ్ వంటివన్నీ ఉంటాయి. అయితే వారు సంతానోత్పత్తి మాత్రం చేయలేరు. పురుష పునరుత్పత్తి అవయవాలు కూడా వారిలో ఉంటాయి.

ఇలా పురుషుడిలో స్త్రీ పునరుత్పత్తి అవయవాలు రావడానికి యాంటీ ములేరియన్ హార్మోన్ ప్రధాన కారణం అని చెప్పుకుంటారు. దీని పనితీరులో లోపం వచ్చినా లేదా ఉత్పత్తిలో తేడా వచ్చినా కూడా ఇలా స్త్రీ పునరుత్పత్తి అవయవాలు పురుషుడిలో పెరగడం ప్రారంభమవుతాయి.గర్భంలో ఉన్నప్పుడే ఈ ప్రక్రియ మొదలవుతుంది. మగ లేదా ఆడ శిశువు గర్భంలో ఉన్నప...