భారతదేశం, అక్టోబర్ 31 -- కార్తీక మాసం అంటే మొట్టమొదట మనకి గుర్తు వచ్చేది దీపారాధన. అందులోనూ ప్రత్యేకించి కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అలాగే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేస్తూ ఉంటారు. ఉసిరి చెట్టు కింద కూర్చుని భోజనం తింటే కూడా మంచి జరుగుతుందని భావిస్తారు. అలాగే కార్తీక మాసంలో పిండి దీపాలు, కొబ్బరికాయలతో ఐశ్వర్య దీపం- ఇలా ఎవరికి నచ్చిన పద్ధతుల్ని వారు పాటిస్తూ ఉంటారు.

కార్తీక మాసంలో పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని, సంతోషకరమైన జీవితాన్ని గడపచ్చని భావిస్తారు. కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఉన్న ప్రత్యేకత ఇంతా అంతా కాదు. కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉసిరి దీపాన్ని వెలిగిస్తారు. అయితే కార్తీకమాసంలో అసలు ఎందుకు ఉసిరి దీపాన్ని వెలిగించాలి? దాని వెనుక కారణాలు ...