భారతదేశం, మార్చి 6 -- USA news: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తరువాత అక్కడ నివసిస్తున్న భారతీయులు సహా విదేశీయుల్లో కొత్త భయాలు ప్రారంభమయ్యాయి. అక్రమంగా లేదా నిబంధనలకు విరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న విదేశీయులందరినీ వారివారి దేశాలకు పంపిస్తామని బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ స్పష్టం చేశారు.

కాగా, అమెరికాలో హెచ్ 1 బీ వీసాదారుల పిల్లలు ఇప్పుడు అమెరికాను వీడాల్సిన పరిస్థితి నెలకొంది. హెచ్ 1 బీ వీసాదారుల పిల్లలు మైనర్లుగా అమెరికాకు వెళ్లి, అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసినవారు, ఇప్పుడు తిరిగి స్వదేశం తిరిగిరావాల్సిన పరిస్థితి ఉంది. తల్లిదండ్రులతో పాటు మైనర్లుగా యూఎస్ వెళ్లి, ఇప్పుడు మైనారిటీ తీరి, 21వ పుట్టినరోజుకు చేరుకుంటున్న పిల్లలు దారుణమైన సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే, వారిని ఇకపై వారి తల్లిదండ్...