భారతదేశం, ఏప్రిల్ 8 -- అమెరికా కాంగ్రెస్​లో ప్రవేశపెట్టిన కొత్త బిల్లు అంతర్జాతీయ విద్యార్థుల్లో, ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) కోర్సులు అభ్యసిస్తున్న వారిలో ఆందోళన రేకెత్తిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత మూడేళ్ల వరకు దేశంలో ఉండటానికి అనుమతించే వర్క్ ఆథరైజేషన్ ప్రోగ్రామ్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపిటి) ని నిలిపివేసే ఉద్దేశంతో ఈ బిల్లును తీసుకొచ్చారు.

వృత్తిపరమైన అనుభవాన్ని పొందడానికి, దీర్ఘకాలిక ఉపాధి వీసాలకు మారడానికి ఓపిటిపై ఆధారపడే అమెరికాలోని లక్షలాది మంది భారతీయ విద్యార్థుల కెరీర్ అవకాశాలను ఈ కొత్త బిల్లు దెబ్బతీస్తుందని నివేదికలు చెబుతున్నాయి.

ఇటీవలి కాలంలో చదువు కోసం అమెరికాకు వెళుతున్న భారతీయుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఓపెన్ డోర్స్ 2024 నివేదిక ప్రకారం 2023-2024 విద్యా సంవత్సరంలో అక్కడ ఉన్న అంతర్...