భారతదేశం, ఆగస్టు 31 -- స్టూడెంట్​ వీసా కలిగి ఉన్న భారతీయులకు ఇండియాలోని యూఎస్​ ఎంబసీ కీలక హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే వీసా రద్దు సహా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. అమెరికా వీసా ఒక హక్కు కాదని, కేవలం ఒక సదుపాయం మాత్రమే అని ఎంబసీ నొక్కి చెప్పింది.

ఈ హెచ్చరికలను ఎక్స్ (గతంలో ట్విట్టర్) ద్వారా తెలియజేస్తూ, ఎంబసీ ఇలా పేర్కొంది:

"అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే మీ విద్యార్థి వీసాపై తీవ్ర ప్రభావం పడుతుంది. మీరు అరెస్ట్ అయినా లేదా ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించినా, మీ వీసా రద్దు అవుతుంది. మీరు దేశ బహిష్కరణకు గురి కావచ్చు. అంతేకాక భవిష్యత్తులో అమెరికా వీసా పొందేందుకు అనర్హులుగా మారవచ్చు. నియమాలను పాటించండి, మీ పర్యటనకు ఆటంకం కలిగించుకోవద్దు. అమెరికా వీసా అనేది ఒక హక్కు కాదు, కేవలం ఒక సదుపాయం మాత్రమే,"...