భారతదేశం, ఏప్రిల్ 9 -- అమెరికాలో ఇటీవల జరిగిన విద్యార్థుల వీసా రద్దులు అంతర్జాతీయ విద్యార్థులను కలవరపెడుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. విదేశీ విద్యార్థులు వీసాలను రద్దు చేసిన తర్వాత నిబంధనలకు అనుగుణంగా లేకపోవడం లేదా జాతీయ భద్రతా సమస్యలువంటి కారణాలను అధికారులు పేర్కొ్న్నారు. ఈ పరిణామాలు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో ఆందోళనను రేకెత్తించాయి. వీసాల రద్దుపై విద్యార్థులు ఇప్పుడు చట్టబద్ధమైన అంశాన్ని గురించి ఆరా తీస్తున్నారు. దీనిని సవాలు చేయవచ్చో లేదో అని ఆందోళన చెందుతున్నారు.

విద్యార్థి వీసాలపై కూడా ట్రంప్ సర్కార్ కఠినంగా వ్యవహరిస్తుండంతో F-1 వీసా ఏం కలిగి ఉంటుంది? విద్యార్థులకు ఏ చట్టపరమైన హక్కులు ఉన్నాయి? విద్యా, ఇమ్మిగ్రేషన్ నియమాలను పాటించినప్పటికీ కొందరు ఇప్పుడు ఎందుకు ప్రమాదంలో ఉన్నారో త...